Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కూతురి దుర్మ‌ర‌ణం విచార‌క‌రం...వెస్ట్ చర్చి బ్రిడ్జి బాగు చేస్తాం...

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (14:16 IST)
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ పెళ్లి బృందం అర్ధ రాత్రి తిరుపతి వెస్ట్ చర్చి వద్ద  వరద నీటిలో  చిక్కుకుని పెళ్లి కూతురు మృతి చెందిన సంఘ‌ట‌న అంద‌రినీ క‌లచివేస్తోంది. ఆ ప్రాంతాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పరిశీలించారు. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా కమిషనర్ పీ.ఎస్ గిరీషా తో కలిసి శనివారం ఉదయం భూమన చేరుకుని ప‌రిశీలించారు. అధికారుల ద్వారా సంఘటన వివరాలను తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు. స్థానిక వెస్ట్ చర్చి వద్ద చోటు చేసుకున్న సంఘటన చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో  మోకాళ్ల లోతు నీళ్లు పోవడమే చాలా కస్టమని, అలాంటిది రాత్రి కురిసిన వర్ధనికి  అర్ధ గంటలోపే బ్రిడ్జి దగ్గర దాదాపు ఎనిమిది తొమ్మిది అడుగుల పైన నీళ్ళు చేరిపోయాయని తెలిపారు.  సరిగ్గా అదే సమయానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన  ఒక పెళ్లి బృందం తమ వాహనంలో చేరుకున్నారని...  డ్రైవర్ నిర్లక్ష్యం  కారణంగా వాహనంలో ఉన్న పెళ్లి కూతురు ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు.ఈ సంఘటన జరిగిన మరో పదిహేను నిమిషాల్లోనే బ్రిడ్జి కింద నీరు త‌గ్గిపోయింద‌ని వివరించారు. 
 
మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఎమ్మెల్యే భూమన బదులిస్తూ... గతంలో ఎన్నడూ ఇలాంటి విషాదం చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు.  భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రత్యేక ప్రణాళికలు చేపడుతామని వెల్లడించారు. ముఖ్యంగా  బ్రిడ్జి కింది భాగంలో ఎత్తు పెంచడం , వరద నీటి కాలువల్లో పూడిక తీయించడం వంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపడ‌తామని భూమన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments