Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘ‌నంగా నాగుల చ‌వితి... మోపిదేవిలో పుట్ట‌లో పాలుపోసి...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:32 IST)
దీపావ‌ళి అనంత‌రం వ‌చ్చే నాగుల చ‌వితిని అంతా సంద‌డిగా నిర్వ‌హిస్తున్నారు. తెల్ల‌వారుజాము నుంచే పుట్ట‌లో పాలు పోసి పూజ‌లు చేసేందుకు భ‌క్తులు క్యూక‌డుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో వేంచేసిన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నాగుల చవితి వేడుకలు నిర్వ‌హిస్తున్నారు.
 
 
తెల్లవారుజామున మూడు గంటల నుంచి దేవస్థానానికి భ‌క్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మోపిదేవిని సంద‌ర్శించుకుని స్వామివారికి పూజ‌లు చేశారు. బారులు తీరుతున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో  లీలా కుమార్, ఎక్క‌డా ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments