Webdunia - Bharat's app for daily news and videos

Install App

బై నాన్నా... మీరు ఒక ఫైటర్ నాన్నా.. తండ్రి గురించి హీరో భావోద్వేగ పోస్ట్

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (11:54 IST)
అనారోగ్యం కారణంగా మృతి చెందిన తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు గురించి ఆయన కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ భావోద్వేగ పోస్ట్ చేశారు. బై నాన్నా.. మీరు ఓ ఫైటర్ నాన్నా అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. 
 
"మీరు ఒక ఫైటర్ నాన్నా.. పేమించడం, యోధుడిలా బతకడాన్ని మీరు నాకు నేర్పించారు. మీ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. ప్రజలకు ప్రేమించడం, మంచి కోసం పోరాటం మేరు నేర్పించారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నప్పటికీ మాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాన్నా.. జీవితాంతం మరిచిపోలేని మీ జ్ఞాపకాలు నాకు ఎన్నో ఉన్నాయి. ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. బై నాన్నా' అంటూ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు, నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరుగనున్నాయి. ప్రజల సందర్శనార్థం రామ్మూర్థి పార్థివదేహాన్ని నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసం వద్ద ఉంచారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అలాగే, మహారాష్ట్ర గవర్నర్ పొన్ రాధాకృష్ణన్ కూడా నారావారిపల్లెకు వచ్చారు. 
 
మరి కాసేపట్లో చంద్రబాబు ఇంటి వద్ద నుంచి రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు నారావారిపల్లెకు తరలివచ్చారు. తమ తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments