Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు కొండాపురంలో బాలికపై అత్యాచారం

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (15:26 IST)
నెల్లూరు జిల్లా కొండాపురంలో ఓ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా కొండాపురంలోని అరుంధతివాడలో ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. స్థానికంగా ఎలాంటి దుకాణాలు లేకపోవడంతో చిన్నవస్తువు కావాలాన్నా పక్కనే ఉన్న రామానుజపురంకు వెళ్లాల్సిందే. 
 
అదే ఆ మైనర్ బాలికపట్ల పాలిట శాపంగా మారింది.గురువాతం రాత్రి భోజన సమయానికి ఇంట్లో పెరుగు లేకపోవడంతో తల్లిదండ్రులు పెరుగు ప్యాకెట్ తీసుకురావాలని బాలికను రామానుజపురానికి పంపించారు. 
 
బాలిక షాపుకెళ్లి పెరుగుప్యాకెట్ తీసుకొని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఉండగా గ్రామంలో కరెంట్ పోయింది. అప్పటికే బాలికపై కన్నేసిన నలుగురు యువకులు.. ఆమెను ఊరిచివర ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. బాలిక కేకలు వేయకుండా నోటిలో గుడ్డలు కుక్కేశారు. కాళ్లు చేతులు కట్టేసి బాలికను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఇంతలో బాలిక మూలుగులు విన్న స్థానికులు చెరువుకట్టవైపున‌కు వెళ్లగా ఆ యువకులు పారిపోయేందుకు యత్నించారు. వీరిలో ఒకరిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ మరో ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments