Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుయా ఆస్పత్రి ఘటనకు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం

Webdunia
గురువారం, 20 మే 2021 (13:24 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని పేరొందిన రుయా ఆస్పత్రిలో కరోనా మృతులు చనిపోవడానికి కారణంగా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పలువురు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 
 
టీడీపీ నేత పీఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని వాదించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆక్సిజన్ సమయానికి అందలేదని చెప్పారని... ఇది నిర్లక్ష్యమేనని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. 
 
బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనలో 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందేనని చెబుతోందని... న్యాయ విచారణకు ఆదేశించాలని వాదనలు వినిపించారు. కేంద్రం ఇచ్చిన ఐదు ప్లాంట్లను నేటి వరకు నెలకొల్పలేదన్నారు. 
 
వాదనలు విన్న కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభమైన తొలిరోజుకి విచారణ జరుగనుంది. కాగా, ఈ ఘటనలో మృతుల లెక్కపై ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేని విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments