Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి: మంత్రి కన్నబాబు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (09:20 IST)
రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకొచ్చేందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నతాధికారుల కమిటీతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమావేశమయ్యారు. రైతులకు రెట్టింపు ఆదాయం, నాణ్యమైన ఉత్పత్తులు, భూసారాభివృద్ది, ప్రజారోగ్యం ప్రధాన లక్ష్యాలుగా సేంద్రియ వ్యవసాయ పాలసీ వుండాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు అన్నారు.

రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో రైతులకు రసాయనాలు, పురుగు మందుల వినియోగం తగ్గించేలా అవగాహనా పెంచాలని ఆయన సూచించారు. బయో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇతర రసాయనాల వినియోగంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. డిమాండ్ మేరకే ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని.. సేంద్రియ వ్యవసాయ పద్దతులపై విస్తృతంగా రైతుల్లో అవగాహనా పెంచాలన్నారు.

కొత్త పంటల సాగు ప్రారంభం నుంచే  వారిని సేంద్రియ వ్యవసాయ విధానంపై ప్రోత్సాహించాలన్నారు. కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల సూచనలు అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తామని మంత్రి కన్నబాబు అన్నారు.  సెరికల్చర్ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు.

పట్టుసాగుకు నూతన రైతులను ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 400 మంది విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్లకు పూర్తి స్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు. రైతుల ఆర్థిక ప్రయోజనాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పట్టు ధరలు తగ్గకుండా ఎక్కువ మంది రీలర్లను ప్రోత్సహిస్తూ తగిన ముందుస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments