Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ - చిరు రాజకీయాల్లోకి వచ్చారు.. ఏం పీకారు? : బాలకృష్ణ

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. అదీకూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు రాజకీయా

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:00 IST)
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. అదీకూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'రాజకీయాల్లో రాణించడం ఒక్క నందమూరి తారక రామారావు గారికే సాధ్యమైంది. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు.. ఏం పీకాడు రాజకీయాల్లోకి వచ్చి? ఉత్తరప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌లో బహుగుణ గారిని ఓడించి ఈయన పార్లమెంట్‌కు వెళ్లాడు తప్పా. పార్లమెంట్‌లో ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికొచ్చాడు? ఇక్కడ చిరంజీవి పరిస్థితి ఏమైంది?.. ఆర్టిస్ట్ అనేవాడు రాజకీయాల్లోకి రావొద్దని నేను సలహా ఇస్తున్నా’ అని అన్నారు. 
 
‘మీరు హిందూపురానికి ఎమ్మెల్యే కదా, మరి, రాజకీయాల్లో మీరెలా..’ అని ప్రశ్నించే లోపే బాలకృష్ణ స్పందిస్తూ, ‘మేము వేరు.. మా బ్లడ్ వేరు.. క్రెడిబిలిటీ ఉండాలి. సినిమా స్టార్ అయితే సరిపోదు. వేరే హీరోలు సినిమాల్లో చెప్పేవి డైలాగ్స్. నా విషయంలో అలా కాదు. నేనేం మాట్లాడాలనుకున్నానో అదే మాట్లాడతా. నాకు ఎవరైనా నచ్చితే నమస్కారం పెడతా, లేదంటే వాడు టాటా అయినా బిర్లా అయినా సరే, కేర్ చేయను. నా స్వభావమే అంత. నాది మా నాన్న బ్లడ్. నా సినిమాల క్యారెక్టర్ల ప్రభావమే నా స్వభావానికి కారణం’ అని బాలయ్య అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments