Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రప్రభ వాహనంపై పద్మావతి అమ్మవారు

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (20:50 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి  అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు.

అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు,  జెఈవో  పి.బ‌పంత్‌కుమార్ దంప‌తులు, సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఏ అండ్ సిఏవో బాలాజి , సిఇ ర‌మేష్‌రెడ్డి, విఎస్వో బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్ర‌మ‌ణ్యం, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, కంకణభట్టార్ వేంపల్లి శ్రీనివాసులు, అలంకార భట్టార్ ఎం.జి.రామచంద్రన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
న‌వంబ‌రు 19న పంచమీ తీర్థం :
నవంబరు 19వ తేదీ గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) సందర్భంగా ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉద‌యం 10 నుండి మధాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments