Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాంపత్య మనస్పర్థలు: పారామెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:41 IST)
కాకినాడలో ఓ దారుణం జరిగింది. దాంపత్యంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఓ పారా మెడికల్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19) ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఎనెస్తీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. 
 
అయితే ఆమె పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం యాళ్లగూడేనికి చెందిన 21 ఏళ్ల మానేపల్లి గంగరాజును 10 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. హాస్టల్లో ఉంటున్న సుధారాణి ఈనెల 17న తన భర్త కాకినాడ రావడంతో స్థానిక కోకిల సెంటర్లోని ద్వారకా లాడ్జిలో రూమ్‌ తీసుకున్నారు. 
 
ఆదివారం రాత్రి వారిద్దరూ ఏదో విషయంపై గొడవపడ్డారు. దాంతో గంగరాజు క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తన భార్య సుధారాణిని విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి సోమవారం ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషనులో లొంగిపోయాడు. 
 
అక్కడి పోలీ సులు ఇచ్చిన సమాచారంతో కాకినాడ ఎస్‌డీపీవో వి.భీమారావు, టూటౌన్‌ ఎస్‌ఐ పి.ఈశ్వరుడు సోమవారం రాత్రి సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఒక్కడే హత్యలో పాల్గొన్నాడా, మరెవరైనా పాలుపంచుకున్నారా అనే దానిపై క్లూస్‌టీమ్‌ రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించింది. అనంతరం మృత దేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments