Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ రెడ్డిగారూ.. తెలుగు పత్రిక నడుపుతూ తెలుగును మృతభాషగా చేయకండి...

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (09:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. నవ్యాంధ్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను తొలగించి, ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా, వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 
 
ఈ నిర్ణయాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం కూడా ఆయన ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. "జగన్ రెడ్డి గారు.. ‘మా తెలుగు తల్లి’ అని పాడాల్సిన మీరు 'తెలుగు భాష తల్లినే' చంపేస్తున్నారు. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అని విజ్ఞప్తి చేశారు. 
 
పైగా, తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన, భస్మాసురతత్వాన్ని సూచిస్తుంది. ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే అని పవన్ తన ట్వీట్‌‍‌లో గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments