Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (19:51 IST)
ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకుని అధునాతన ప్యాలెస్‌ను నిర్మించినట్టు వచ్చిన వార్తలపై వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అడవిలో భూమి ఆక్రమించుకుని, మా పనోళ్ళ కోసం, అడవిలో ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టి, వాళ్ళ కోసం మామిడి చెట్లు కూడా పెట్టాం.. అది కేవలం మా పనోళ్ళు సురక్షితంగా ఉండటం కోసం కట్టిన భవనం అని వివరించారు. పనోళ్ళ గెస్ట్ హౌస్ కోసం, అడవిలో రోడ్డు కూడా వేసినట్టు చెప్పారు. 
 
వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు తెదేపా కార్యకర్తల భరతం పడతామని బహిరంగ హెచ్చరికలు జారీచేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. సోషల్‌ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామస్థాయిలో కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతాం. 
 
వైకాపా కార్యకర్తలపై చేసిన దాడులకు ప్రతి దాడులు కచ్చితంగా ఉంటాయి. మా తడాఖా ఏందో జగన్‌ సీఎం అయ్యాక వారికి రుచి చూపిస్తాం. ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటాం, భరోసా ఇస్తామని జగన్‌ చెప్పారు. జగన్‌ ఆదేశాలను అందరూ పాటించాలి. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు' అని పెద్దిరెడ్డి అన్నారు. 
 
కాగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో భారీ మొత్తంలో ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకోవడంతోపాటు దట్టమైన అటవీ ప్రాంతంలో విలాసవంతమైన అతిథి గృహాన్ని కూడా నిర్మించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర అటవీశాఖామంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీంతో పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈ తరహా బహిరంగ హెచ్చరికలు చేయడం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments