పీటీ వారెంట్‍‌పై కర్నూలు నుంచి భవానీపురం పీఎస్‌కు పోసాని తరలింపు!

ఠాగూర్
శనివారం, 8 మార్చి 2025 (12:45 IST)
వైకాపా నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళిని పోలీసులు కర్నూలు నుంచి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయనను ఇక్కడకి తీసుకొచ్చారు. విజయవాడ కోర్టులో ఆయనను హాజరుపరుస్తారు. ఒకవేళ కోర్టు పోసానికి రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది. రిమాండ్ విధించనిపక్షంలో మరోమారు కర్నూలు జైలుకు పంపిస్తారు. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను పోసానిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, గత వైకాపా ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై, మీడియా సంస్థలపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై పలు పోలీస్ స్టేషన్‌లలో పోసాని కృష్ణమురళిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో ఒక్కొక్కటిగా పోలీసులు పోసానిని అరెస్టు చేస్తున్నారు. 


ఎపుడైనా బొక్కలో వేస్తారు జగనన్నా... శ్రీరెడ్డి వీడియో 
 
గత వైకాపా ప్రభుత్వంలో తన నోటికి అడ్డూ అదుపు లేకుండా పని చెప్పిన నటి శ్రీరెడ్డి ఇపుడు టీడీపీ కూటమి పాలకులను శరణు వేడుకుంటున్నారు. నోటికి తాళం వేసుకుని వైకాపా నేతలను బూతులు తిడుతున్నారు. తాజాగా ఆమె ఎక్స్ ఖాతాలో పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగనన్నా.. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి బొక్కలో వేస్తారు.. ఆ రోజు వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని వైకాపా నేతలు చేతులెత్తేస్తారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఏనాడైనా తనను వైఎస్ఆర్ సీపీ పిల్లని అని చెప్పారా అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. 
 
పైగా, పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని టచ్ చేయాలంటే ఎవరైనా జడుసుకుంటున్నారన్నారు. దీనికి కారణం... వారి కార్యకర్తలను ఓ రక్షణ కవచంలా తయారు చేశారన్నారు. ఇపుడు వైకాపా గురించి ఎవరైనా పాజిటివ్‌గా పోస్ట్ పెడితే వారిని చీల్చి చెండాడుతున్నారన్నారు. పైగా, తనను కూడా ఇపుడు కాకుంటే రేపైనా, ఎపుడైనా అరెస్టు చేయడం ఖాయమన్నారు. ఆరోజున శ్రీరెడ్డి వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని చేతులెత్తేస్తారంటూ వైకాపా నేతలను బూతు పదజాలంతో దూషించారు. 
 
కాగా, గత వైకాపా అధికారంలో ఉన్నపుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ సభ్యులు, చిరంజీవి తల్లి అంజనా దేవి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేశ్‌లతో పాటు వైకాపా మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులను శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments