Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

Webdunia
సోమవారం, 9 మే 2022 (18:57 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తుందని… గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై వేగాన్ని అదుపు చేయడానికి రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా, వైద్యపరంగా ఆదుకోవాలి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… మృతుల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
కాగా కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments