Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందనీ వెళ్ళిన మహిళా ఎస్ఐ.. లోపల చూసి షాక్...

కర్నూలు పట్టణంలోని ఓ లాడ్జీలో అశ్లీల నృత్యాలతో పాటు వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో షీ టీమ్స్‌కు చెందిన మహిళా ఎస్ఐ ఆ లాడ్జీలో తనిఖీల కోసం వెళ్లింది. గది లోపల జరుగుతున్న తంతు.. అక్కడున్న ఓ అధికారిని చ

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (15:28 IST)
కర్నూలు పట్టణంలోని ఓ లాడ్జీలో అశ్లీల నృత్యాలతో పాటు వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో షీ టీమ్స్‌కు చెందిన మహిళా ఎస్ఐ ఆ లాడ్జీలో తనిఖీల కోసం వెళ్లింది. గది లోపల జరుగుతున్న తంతు.. అక్కడున్న ఓ అధికారిని చూసి ఆమె విస్తుపోయారు. చేసేదేమీ లేక మొత్తం తతంగాన్ని వీడియోలో చిత్రీకరించి, పై అధికారులకు చేరవేసింది. 
 
కర్నూలు పట్టణంలోని స్థానిక మౌర్యా ఇన్‌ సర్కిల్‌లో ఉన్న హర్షా లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. ముందుగా తమ సిబ్బందిని మూడు వైపుల నుంచి లోపలికి పంపిన మహిళా ఎస్ఐ తాను కూడా మఫ్టీలో జరుగుతున్న తంతును తన మొబైల్‌లో చిత్రీకరిస్తూ లోపలికి వెళ్లారు. లోపల టేబుళ్ల చుట్టూ కూర్చుని కొంతమంది మద్యం సేవిస్తుంటే, స్టేజిపైన ముగ్గురు యువతులు అశ్లీలంగా నృత్యం చేస్తున్నారు. 
 
వీడియో చిత్రీకరించుకుంటూ లోనికి వెళ్లిన ఎస్‌ఐ... అకస్మాత్తుగా ఓ వ్యక్తిని చూసి షాక్‌కు గురయ్యారు. అనుకోకుండానే శాల్యూట్‌ చేశారు. ఆ వ్యక్తి గతంలో వన్‌టౌన్‌ సీఐగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో కీలక అంశాలు రాబట్టే విభాగంలో సీఐగా ఉన్నారు. షీ టీమ్‌ బృందాల రాకతో లోపల ఉన్న మిగతా వారంతా పరారయ్యారు. ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కానీ, ఆ సీఐ మాత్రం ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ షీటీమ్‌ బృందాలను గద్దించాడు. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందిందని చెప్పడంతో.. 'వ్యభిచారం లేదు, ఏదో పార్టీ.. డ్యాన్స్‌ చేసుకుంటున్నారు' అంటూ నిర్వాహకులకు వత్తాసు పలికారు. పార్టీలో ఉన్న వారంతా పారిపోయినా సీఐ మాత్రం వెళ్లలేదు కదా షీ టీమ్స్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు చేసేదేం లేక తాను కూడా అక్కడ నుంచి జారుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments