Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం: రఘురామ

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (16:15 IST)
అమరావతి రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలను ప్రచారం చేశారని, దాని వల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని తెలిపారు. వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించి, సీఎం జగన్‌ ఓదార్చాలని కోరారు. విశాఖలో తమ ప్రభుత్వం వచ్చాక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఎత్తి చూపారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో తెలాలని, నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు. ‘‘నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్‌లో చాటింగ్ బయట పెట్టామని అంటున్నారు.. నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్ సాఫ్ట్‌వేర్ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?’’ అని రఘురామ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments