Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులకు ఇచ్చే రెమ్‌డెసివిర్‌ సూదిమందు బ్లాక్ మార్కెట్: ఏడుగురి అరెస్టు

Webdunia
సోమవారం, 10 మే 2021 (19:09 IST)
కరోనా రోగులకు ఇవ్వాల్సిన రెమ్‌డెసివిర్‌ సూదిమందు నల్లబజారులో విక్రయించిన ముఠాను అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను సీఐ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సులు, ముగ్గురు జిల్లా సర్వజన ఆసుపత్రి పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నారు.

వీరి నుంచి 14 రెమ్‌డెసివిర్‌ సూది మందును, రూ.94 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సులు సుకన్య, భారతి, సర్వజన ఆసుపత్రి పొరుగు సేవల ఉద్యోగులు రాజేష్‌, నరేంద్ర, కిశోర్‌నాయుడుతో పాటు విశ్వనాథరెడ్డి (రామచంద్రనగర్‌), సత్యనారాయణ (మాలవాండ్లపల్లి, నార్పల) ఉన్నారు.
 
నేపథ్యం ఇదీ..
సర్వజన ఆసుపత్రిలో పొరుగు సేవల ఉద్యోగుల రాజేష్‌, నరేంద్ర, కిశోర్‌నాయుడుతోపాటు ప్రైవేటు మెడికల్‌ మార్కెటింగ్‌ విభాగంలో పని చేస్తున్నారు. వీరందరూ కలిసి రెమ్‌డెసివిర్‌ అక్రమ వ్యాపారానికి తెరలేపారు. సర్వజన ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులకు అవసరాన్ని బట్టి ఇంజక్షన్లు వాడుతున్నారు. ఈక్రమంలో వాటిని దారి మళ్లిస్తున్నారు. సగం ఇంజక్షన్లు రోగులకు ఎక్కించి మిగిలిన మందును నర్సులు ఈ ముఠా సభ్యులకు విక్రయించారు. ఒక్కో సూది మందు రూ.16 వేలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments