Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల్య వివాహం కాదన్నారనీ, పెళ్లికి ముందే కాపురం చేయించారు... బాలిక గర్భం

Webdunia
సోమవారం, 15 జులై 2019 (11:30 IST)
ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు బాల్య వివాహం చేయించాలని భావించారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ అధికారులు బాల్య వివాహానాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు పెళ్లికి ముందే కట్టుకోవాల్సినవాడితో కాపురం చేయించారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చడంతో ఈ విషయం బహిర్గతమైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే బాసదలో ఆశ్రయం పొందుతోంది. ఇటీవల ఆ బాలిక ఇటీవల అస్వస్థతకు గురైంది. దీంతో సిబ్బంది ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆ బాలిక గర్భవతి అని తేల్చారు. 
 
గత విద్యా సంవత్సరం పదో తరగతి పూర్తి చేసిన సదరు బాలిక ఇంటర్‌లో చేర్పించాలని తల్లిదండ్రును కోరింది. కానీ వారు బలవంతంగా ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు. అప్పటికే పెళ్లయిన వ్యక్తితో మూడు నెల క్రితం నిశ్చితార్థం చేశారు. పెళ్లి ఇష్టం లేదని, ఆపించాలని తెలిసిన వారి ద్వారా బాధితురాలు అధికారులను ఆశ్రయించడంతో వారు అడ్డుకున్నారు. 
 
బాల్య వివాహం నేరమని, ఆమె ఇష్టాన్ని గౌరవించాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి వెళ్లిపోయారు. అయినా మార్పురాని బాలిక తల్లిదండ్రులు నిశ్చితార్థమైన వ్యక్తితో పెళ్లికాకుండానే బలవంతంగా కాపురం చేయించారు. కొన్నాళ్లు నరకం అనుభవించిన బాలిక ఇంట్లో నుంచి పారిపోయి మళ్లీ అధికారులను ఆశ్రయించింది. పరిస్థితిని గుర్తించిన అధికారులు బాలికకు బాసదనంలో ఆశ్రయం కల్పించారు. 
 
కానీ అప్పటికే ఆమెతో సదరు వ్యక్తి కాపురం చేసి ఉండడంతో గర్భవతి అయ్యింది. అనారోగ్యానికి గురికావడంతో ఈ విషయం బయటపడిరది. దీంతోరంగ ప్రవేశం చేసిన పోలీసు బాలిక కుటుంబానికి చెందిన నలుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులతో పాటు.. బాలికకు గర్భం చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. బాలికకు అబార్షన్ చేయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం