ప్రధాని మోడీ విజయవాడ్ రోడ్‌షోలో డ్రోన్ల ఎగురవేత : కేంద్రం సీరియస్

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవాడ నగరంలో రోడ్‌షో నిర్వహించారు. ఇందులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అయితే, ప్రధాని మోడీ రోడ్ షో సందర్భంగా డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. ఈ చర్యలు కేంద్రం సీరియస్‌గా తీసుకుంది.
 
ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. ప్రధాని రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు, రోడ్ షో ముగింపు సమయంలో డ్రోన్లు ఎగురవేశారంటూ తన లేఖలో ఆరోపించింది.
 
ప్రధాని రోడ్ షో చేపట్టిన బందరు రోడ్ ప్రాంతాన్ని ఎస్పీజీ ముందుగానే నో ఫ్లై జోన్‌‍గా ప్రకటించింది. ఎస్పీజీ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ మోడీ రోడ్ షోలో డ్రోన్లు కనిపించాయి. రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు ఓ డ్రోన్‌ను గుర్తించిన ఎస్పీజీ సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు. నిజానికి నో ఫ్లై జోన్‌గా ప్రకటించిన తర్వాత ఎలాంటి డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేదు. కానీ, ఎస్పీజీ అధికారులు వారించినప్పటికీ ఏపీ పోలీసులు ఈ డ్రోన్లు ఎగురవేసినట్టు సమాచారం. దీనిపై అటు కేంద్రం, ఇటు ఎస్పీజీ విభాగం సీరియస్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments