Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలోఘనంగా ముగిసిన శివరాత్రి వేడుకలు

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (09:57 IST)
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మహా శివరాత్రిపర్వదినాన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్,  స్థానిక ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి,  దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్, పంచాయతీ రాజ్ & రూరల్ దేవలప్మెంట్  కమీషనర్ గిరిజా శంకర్,  జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప లు గురువారం రాత్రి దర్శించుకున్నారు.
 
గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌.రామరావు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.
 
అనంతరం, శ్రీశైలం దేవస్థానం లో మహా శివరాత్రి పర్వదినాన విశేష కార్యక్రమలుగా నిర్వహించిన నంది వాహన సేవ, స్వామి వారి ఆలయ శిఖరానికి, నవనందుల  పాగాలంకారణ, లింగోద్భవ దర్శనం, అనంతరం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవార్ల కల్యాణోత్సవంలో మంత్రి అవంతి శ్రీనివాస్, లోకల్ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, లోకల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, ఈ.ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు
 
దాదాపు 85,000 ల మంది భక్తులు శివరాత్రి నాడు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారని ఈ.ఓ.రామారావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments