Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్ అని చనువిస్తే.. ఏం చేశాడో తెలుసా?

ఫ్రెండ్ అని చనువిస్తే ప్రియురాలికి కాబోయే భర్తకు అశ్లీల ఫోటోలు పంపించాడు. ఇంతకీ ఈ పాడు పని చేసింది కూడా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఆ యువతి తనను ప్రేమించకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన

Webdunia
శనివారం, 1 జులై 2017 (08:43 IST)
ఫ్రెండ్ అని చనువిస్తే ప్రియురాలికి కాబోయే భర్తకు అశ్లీల ఫోటోలు పంపించాడు. ఇంతకీ ఈ పాడు పని చేసింది కూడా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఆ యువతి తనను ప్రేమించకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఈ పాడుపనికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ జిల్లా వనపర్తి జిల్లాకు చెందిన పవన్ కుమార్.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కొన్నేళ్ళ క్రితం స్థానికంగా ఉండే ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యనభ్యసించాడు. అతడిది మెకానికల్‌ బ్రాంచ్. అదే కాలేజీలో ఐటీ బ్రాంచకు చెందిన యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లంటూ వెంటపడటంతో ఆమె అతడిని దూరం పెట్టింది. ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా చేరారు. ఆ యువతికి వేరే వ్యక్తితో ఇటీవల పెళ్లి కుదిరింది. 
 
ఈ విషయం తెలుసుకున్న పవన్.. ఆమెకు ఫోన్ చేసి ప్రేమించాలని వేధించాడు. అసభ్యకర సందేశాలు పంపి బెదిరింపులకు దిగాడు. స్పందన రాకపోవడంతో ఆమె పెళ్లిని చెడగొట్టేందుకు ఈ దారుణాలకు తెగబడ్డాడు. ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి.. తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫొటోలు, వీడియోలను ఆమెను చేసుకోబోయే వ్యక్తికి పంపాడు. తనను ప్రేమించకపోతే ఫొటోలను అశ్లీలంగా కనిపించేలా మార్ఫింగ్‌ చేసి వెబ్‌సైట్లలో పోస్ట్‌చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు.
 
దీంతో ఈ వేధింపులను భరించలేదని ఆ బాధితురాలు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పవన్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments