Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా.. బాబే అలా?: సోమువీర్రాజు

తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీలేదని టీడీపీ సమావేశంలో చంద్రబాబు అన్న మాటన

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:24 IST)
తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీలేదని టీడీపీ సమావేశంలో చంద్రబాబు అన్న మాటను సోమువీర్రాజు గుర్తు చేశారు. హోదా అంటే జైలుకేనని చంద్రబాబే స్వయంగా చెప్పారని.. ప్రస్తుతం ఎవరు జైలుకు వెళ్ళాలో చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 
 
హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదని చంద్రబాబే స్వయంగా చెప్పారనే విషయాన్ని గుర్తు చేషారు. హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా అని చంద్రబాబు అనలేదా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని ప్రశ్నించకూడదని... చంద్రబాబునే అడగాలని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. 
 
పోలవరం వద్దని తెలంగాణ ఎంపీలు నిరసన చేస్తే, ఏపీ టీడీపీ ఎంపీలు ఏం చేయలేకపోయారని సోమువీర్రాజు విమర్శించారు. ఏపీకి ఏం కావాలో అడగకుండా పార్లమెంట్‌లో సీఎం రమేష్‌, సుజనా సమన్యాయం కావాలన్నారని సోమువీర్రాజు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో  ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments