Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో గూడూరు-విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (20:52 IST)
దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సులువుగా చేరేందుకు వీలుగా, గూడూరు-విజయవాడ-గూడూరు మధ్య నూతన ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు చేసిన సూచనకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. 
 
రైల్వేబోర్డు ఆదేశించిన మేరకు రైలు నంబరు 12743 గూడూరు-విజయవాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, ప్రతిరోజూ గూడూరు నుండి ఉదయం 06:10 గంటలకు బయలుదేరి, విజయవాడకు ఉదయం 10:40 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 12744 విజయవాడ-గూడూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, విజయవాడ నుండి ప్రతిరోజూ సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరి, గూడూరుకు రాత్రి 10:30 గంటలకు చేరుతుంది.

మార్గమధ్యంలో ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, మరియు తెనాలి రైల్వేస్టేషన్లలో ఆగనున్నది. ఈ రైలు రెండు ఏసి చైర్ కార్, పది నాన్ ఏసి చైర్ కార్, రెండు పవర్ కార్ బోగీలతో మొత్తం పద్నాలుగు బోగీలతో నడవనున్నది. ఈ నూతన రైలుకు సంబంధించిన అధునాతన LHB బోగీలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నందున, అతి త్వరలో ఈ రైలు ప్రారంభం .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments