Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుతో రాజమౌళి భేటీ.. అమరావతి నిర్మాణం.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి భేటీ అయ్యారు. రాజధానిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో రాజమౌళి సహకారాన్ని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆకృతులపై చర్చించేందుకు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి భేటీ అయ్యారు. రాజధానిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో రాజమౌళి సహకారాన్ని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆకృతులపై చర్చించేందుకు రాజమౌళి అమరావతి వచ్చారు. ఇప్పటికే రాజమౌళిని కలిసి ఆకృతుల గురించి మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివరించారు.
 
తెలంగాణలోని యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, ఆలయ పరిసరాల అభివృద్ధికి సంబంధించి సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంప్రదించిన విషయం విదితమే. ఆ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఇచ్చిన డిజైన్ల మేరకే అక్కడ అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినీ జనాల్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనడానికి ఇదొక నిదర్శనం. 
 
ఇదే తరహాలో ఇప్పటికే అమరావతి డిజైన్ల విషయంలో ప్రపంచంలోనే టాప్‌-10 సంస్థల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. ఆయా సంస్థలు డిజైన్లు కూడా ఇచ్చాయి. కానీ అవేవీ చంద్రబాబుకు నచ్చలేదు. అందుకే, రంగంలోకి రాజమౌళిని దించాలనుకున్నారు. 
 
మరి రాజమౌళి సూచనలు చంద్రబాబు నచ్చుతాయో లేదో అనే విషయాన్ని పక్కనబెడితే.. ఏపీలో టీడీపీ పరిపాలనకు వచ్చి మూడున్నరేళ్ళ తర్వాత కూడా, రాజధాని అమరావతి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు వంకలు వెతుక్కుంటున్నట్టున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
అమరావతి నిర్మాణానికి సంబంధించి బాబు ఇంకా డిజైన్ల వరకే పరిమితం కావడంపై విపక్షాలతో పాటు ప్రజలు కూడా ఫైర్ అవుతున్నారు. మరి చంద్రబాబు అమరావతి విషయంలో ఎలాంటి డిజైన్ ఓకే చేస్తారో.. నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments