Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సూర్యనారాయణరాజు నామినేషన్ దాఖలు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (23:16 IST)
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిగా పెనుమ‌త్స సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) గురువారం శాసన మండలి భవనంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన పేరును ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఖ‌రారు చేశారు.

ఇటీవ‌ల రాజ్యస‌భ‌కు ఎన్నికైన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, దివంగ‌త పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజు తనయుడు సూర్యనారాయణ రాజును అభ్యర్థిగా సిఎం జగన్ నిర్ణయించారు.

దీంతో సురేష్‌బాబు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి సుబ్బారెడ్డికి దాఖ‌లు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి సురేష్‌బాబు వెంట రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కోరుముట్ల శ్రీనివాసులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ పెన్మత్స సూర్యనారాయణరాజు (సురేష్‌ బాబు)కు క్యాంపు కార్యాలయంలో సీఎం జ‌గ‌న్ బీ ఫారమ్‌ అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments