Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ వల్లనే టీడీపీ ఓటమి... బాపట్ల మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (21:00 IST)
కేవలం నారా లోకేష్ కారణంగానే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఓడిపోయిందని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... "కేంద్రంతో మాట్లాడి సిబిఐ విచారణ జరిపిస్తా. కేవలం నారా లోకేష్ కారణంగానే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం వాల్‌పోస్టర్లు కూడా అంటించా. సొంత నిధులు ఖర్చుపెట్టి పార్టీని నడిపించా. 
 
కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్‌గా పలు కీలక పదవులలో పని చేసి కార్యకర్తగా పార్టీలో ఎదిగాను. తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రిని కాలేదు. ఎందరో నాయకులు లోకేష్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. లోకేష్ లాంటి నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయడం ఇష్టం లేక పార్టీకి రాజీనామా చేసాను. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లోకేష్ నిట్టనిలువునా ముంచారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుకు ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టారు లోకేష్. 
 
లోకేష్ కారణంగా త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కాబోతుంది. నాకు పదవీకాలం ఉన్నటికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాను. లోకేష్ చేసిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. లోకేష్ కారణంగానే ఎందరో సీనియర్ నాయకులు తెదేపాను వీడి బిజెపిలో చేరారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తాను. 
 
వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజెపినే.  2022 లో జిమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటి శాఖలో జరిగిన అవినీతిపై రెండుమూడు రోజులలో ముఖ్యమంత్రిని కలుస్తున్నా" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments