Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంచ ఐలయ్య ఓ దేశ ద్రోహితో సమానం : ఎంపీ టీజీ వెంకటేశ్

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్త‌కం రాసిన ఆచార్య కంచ ఐలయ్యపై అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మండిపడ్డారు. కంచ ఐలయ్యను ఓ దేశ ద్రోహీగా పోల్చారు.

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (16:42 IST)
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్త‌కం రాసిన ఆచార్య కంచ ఐలయ్యపై అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మండిపడ్డారు. కంచ ఐలయ్యను ఓ దేశ ద్రోహీగా పోల్చారు. 
 
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్త‌కం రాసిన ఐలయ్య తీరుపై హైదరాబాద్‌లో ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన విష‌యం తెలిసిందే. ఈ సమావేశంలో టీజీ వెంక‌టేశ్ మాట్లాడుతూ... సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రొ.కంచ ఐల‌య్యలాంటి వారు దేశ ద్రోహులతో సమానమన్నారు. 
 
ఇలాంటి పదాలతో రాసేవారిని అరబిక్ దేశాలలో నడి రోడ్డు మీదే శిక్షిస్తారని, మతాన్ని, కులాన్ని అవ‌మాన‌ప‌రిచే ఐల‌య్య లాంటి వాళ్లను న‌డిరోడ్డుపై ఉరి తీసేలా మ‌న దేశంలోనూ చ‌ట్టాలు తీసుకురావాలన్నారు. ఐల‌య్యకు మ‌ద్ద‌తుగా నిలుస్తోన్న నేత‌ల‌ను మతిభ్రమించిన నేతలుగా టీజీ వెంక‌టేశ్ అభివ‌ర్ణించారు. ఐలయ్యపై అన్ని ప్రాంతాల్లోనూ కేసులు పెడ‌తామ‌ని అన్నారు. 
 
అలాగే, ఈ సమావేశంలో పాల్గొన్న‌ సినీనటి కవిత మాట్లాడుతూ.. కంచ ఐలయ్య డేరా బాబాకంటే పెద్ద ద్రోహ‌ని అన్నారు. ఆర్య‌వైశ్యులను అవ‌మాన‌ప‌ర్చిన ఐలయ్యకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విష‌యంపై  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి ఐల‌య్య‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఆర్య‌వైశ్యులు ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తార‌ని, అటువంటి వారిపై ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments