Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యా... నీ తీరేం బాగోలేదు : తెలుగుదేశం నేతల్లో అసంతృప్తి

టీడీపీ నేత, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జర

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (15:31 IST)
టీడీపీ నేత, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు కలవరపడుతూ తమలోని అసంతృప్తిని బహిరంగానే వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, వీటిని ఎలా సమర్థించుకోవాలో తెలియని స్థితిలో వారు ఉన్నారు. పైగా, సీఎంకు బామ్మర్ధి కావడంతో పాటు సినీ హీరో అయినందువల్ల ఇలా చేయవద్దని ఆయనకు చెప్పలేకపోతున్నామని, ఇక చంద్రబాబే బాలయ్యతో మాట్లాడాలని పార్టీ సీనియర్ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.
 
తాజాగా, అనంతపురం జిల్లాలో జరిగిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న వేళ, ఓ అభిమాని, టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ కొట్టినట్టు కనిపిస్తున్న వీడియో వైరల్ అయింది. పంచ్ డైలాగులు, ఫైట్స్‌తో సినిమాల్లో తన అభిమానులను అలరించే బాలకృష్ణ, ఇలా తనపై అభిమానం చూపే వారిమీద సంయమనం కోల్పోయి చెయ్యి చేసుకోవడం పార్టీపై చెడు ప్రభావాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానిస్తున్న వారి సంఖ్య టీడీపీలో క్రమంగా పెరుగుతోంది. పూలదండ వేయాలని వచ్చిన వారిని, సెల్ఫీ దిగాలని భావించిన వారిని కొట్టడం మంచిది కాదని వారు హితవు పలుకుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments