Webdunia - Bharat's app for daily news and videos

Install App

దురదృష్టం అంటే ఇదీ... ఓటు వేయని సర్పంచ్ అభ్యర్థి.. ఒక్క ఓటు తేడాతో ఓడాడు...

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (09:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా, తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరిగింది. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో ఒక సర్పంచ్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయాడు. 
 
ఆ ఓటు కూడా సర్పంచ్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరినీ తనకు ఓటు వేయాలని పదేపదే కోరిన ఆయనే... చివరకు తన ఓటు వేసేందుకు మరచిపోయాడు. ఫలితంగా కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమిని చవిచూశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని రంగాపురం గ్రామ సర్పంచ్ పదవికి మర్రి ఆగంరెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డి వేర్వేరు పార్టీల తరపున పోటీ చేశారు. సోమవారం ఎన్నికలు నిర్వహించగా మధ్యాహ్నం వరకు ఆగంరెడ్డి దంపతులు తమకే ఓటు వేయాలంటూ అందరినీ అభ్యర్థించారు. 
 
తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయితే, ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైన ఆ దంపతులు... తమ ఓటును వేసుకోవడం మరచిపోయారు. పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత వారిద్దరి ఓట్లే ఫలితాలన్ని తారుమారు చేసింది. ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. 
 
ఆగంరెడ్డి దంపతులు తమ ఓట్లను వేసుకుని ఉంటే రెండు ఓట్లు పడేవి. ఫలితంగా ఒక్క ఓటు తేడాతో ఆయనే గెలిచి ఉండేవారు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం అతడి జీవితాన్ని తారుమారు చేసింది. చేసేది లేక ఇప్పుడు తీరిగ్గా బోరున విలపిస్తున్నారు ఆ దంపతులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments