Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (05:17 IST)
ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
 
 
660 జెడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు 21న పోలింగ్‌, 24న కౌంటింగ్: 
ఏపీలో 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి రోజు బుధవారం నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాలు సందడిగా మారాయి. గురువారం(మార్చి 12,2020) ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 13న  నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 21న ఎన్నికల పోలింగ్‌, 24న కౌంటింగ్‌ జరగనుంది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో.. ఇక గెలుపు వ్యూహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి.
 
రాష్ట్రంలో 2,82,15,104 మంది ఓటర్లు: 
రాష్ట్రంలో 2 కోట్ల 82 లక్షల 15 వేల 104 మంది ఓటర్లు ఉండగా.. 33 వేల 663 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది. అయితే వీటిలో 10 వేల 487 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవి కాగా.. 11వేల 251 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎన్నికలకు మొత్తం 2 లక్షల మందికి పైగా పోలింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నారు.
 
 పట్టణ, నగర పాలక సంస్థలకు నామినేషన్ల స్వీకరణ: 
  ఇక పట్టణ, నగర పాలక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 75 మున్సిపాలిటీలకు, 12 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒకే విడతలో మార్చి 23న ఎన్నికలు జరుగుతాయి. 27న ఓట్ల లెక్కింపు చేపడతారు.  
 
రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు: 
ఇక రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు మార్చి 17 నుంచి 19 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో జరిగే వాటికి 19 నుంచి 21 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలతో ఏపీలో హడావుడి మొదలైంది. అన్ని పార్టీలూ సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments