Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (08:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మండలంలో అయిన జడ్పీటీసీ,ఎంపీపీ రెండూ స్థానాలు అన్-రిజర్వుడ్ అయినచో ఒక స్థానాన్ని బీసీ, ఎస్సీ,ఎస్టీ లకు కేటాయించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% బిసి,ఎస్సి,ఎస్టీలకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇపుడు జడ్పీటీసీ,ఎంపీపీ లలో ఓ స్థానాన్ని బీసీ, ఎస్సీ,ఎస్టీ లకు ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పార్టీ పెద్దలకు సూచించారు.

ఇప్పటికే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ముగిసింది.కానీ ఫలితాలు కోసం కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.రాష్ట్రంలో చాలా జడ్పీటీసీ స్థానాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.మొత్తం ఫలితాలు వెలువడిన అనంతరం ఎంపీపీ ని ఎన్నుకోవాల్సి ఉంది.

ఈ క్రమంలో ఏకగ్రీవం అయిన జడ్పీటీసీ స్థానాన్ని ఇపుడు మార్చేందుకు వీలులేదు.ఎంపీపీ అభ్యర్థిని మార్చేందుకు ఆస్కారం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఏ మండలంలో జడ్పీటీసీ,ఎంపీపీ
రెండూ అన్-రిజెర్వుడ్ ఉన్న చోట్ల ఎంపీపీ ని బీసీ, ఎస్సీ,ఎస్టీలకు కట్టబెట్టబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments