Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్‌లో పరిచయమైన స్నేహితురాళ్లు.. వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (10:11 IST)
ఇటీవలి కాలంలో యువత టిక్ టాక్ మాయలో మునిగిపోతున్నారు. తమకు తోచినట్టుగా వీడియోలు తీసి అందులో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు నచ్చిన వారు కామెంట్స్ చేస్తుంటే ఆనందం పొందుతున్నారు. మరికొందరు స్నేహితులుగా మారిపోతున్నారు. ఇలాంటి వారు కొన్ని రకాల వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఫలితంగా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా టిక్ టాక్ ద్వారా పరిచయమైన కొంతమంది స్నేహితురాళ్లు.. మరో స్నేహితురాలిని వ్యభిచారం చేయాలంటూ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని ఆ యువతి ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విళుపురం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని సత్యమంగళం గ్రామంలో కడల్ కన్ని (39) అనే మహిళకు భర్త చనిపోవడంతో తన తన పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటూ వస్తోంది. ఈమెకు చెన్నైకు చెందిన సుమతి, లత, కవిత అనేవారు టిక్ టాక్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. 
 
వీరంతా కలిసి కడల్ కన్నిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు మగవాళ్లను పంపి, రూ.2 లక్షలు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. దీనిపై కడల్ కన్ని పోలీసులను ఆశ్రయించగా, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తూ, ఆమె ఇంట్లోనే ఉరితాడు బిగించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన కుటుంబీకులు, వెంటనే ఆమెను కిందకు దించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments