Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల సెక్యూరిటీతో పెట్టుకోవద్దండి.. చంపేస్తారు...!

మీకు వింటుంన్నది నిజమే. తిరుమల సెక్యూరిటీతో పొరపాటును గొడవ పెట్టుకుంటే వారు మిమ్మల్ని చంపేస్తారు. అలాంటిది సంఘటన తిరుమలలో జరిగింది. సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకున్న ఒక భక్తుడు చావు బతుకుల మధ్య క

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (12:23 IST)
మీకు వింటుంన్నది నిజమే. తిరుమల సెక్యూరిటీతో పొరపాటును గొడవ పెట్టుకుంటే వారు మిమ్మల్ని చంపేస్తారు. అలాంటిది సంఘటన తిరుమలలో జరిగింది. సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకున్న ఒక భక్తుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతిన్నాడు. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమల క్షేత్రంలో చిన్నచిన్న సంఘటనలు చోటుచేసుకోవడం మామూలే. దానికి తగిన విధంగా టీటీడీ ఎప్పటికప్పుడు జాగ్రత్తల తీసుకుంటూనే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అక్కడి సిబ్బంది శృతిమించి ప్రవర్తిస్తున్నారు. వస్తున్న భక్తులను హీనం చూస్తున్నారు. ప్రతిదానికి విసుక్కుంటున్నారు. ఇదేమని అడిగితే ఏకంగా దాడి చేస్తున్నారు. తాజాగా ఒక భక్తుడిపై సెక్యురిటీ సిబ్బంది దాడి చేయడంతో కోమాలో వెళ్లిపోయాడు. ఇది టీటీడీ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. 
 
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి చెందిన పద్మనాభం ఈ నెల 19న తిరుమల్లో శ్రీవారి దర్శనానికి వచ్చాడు. తన మనవరాలి పుట్టెంట్రులు సమర్పించడానికి 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. మొక్కులు చెల్లించుకున్న తరువాత ఈనెల 20న రాత్రి 9 గంటల సమయంలో దర్శనం కోసం మహాద్వారం దగ్గరుకు వెళ్లాడు. దానిపక్కనే చిన్న పిల్లలు కలిగి వారు లోపలికి వెళ్లడానికి ప్రవేశం ఉంటుంది. అక్కడి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన పద్మనాభం ఎటు వెళ్లాలో తెలియక మహిళ స్కానింగ్ పాయింట్ వద్దకు వెళ్లాడు. అయితే ఇక కాదని చెప్పి మార్గం చూపాల్సిన అక్కడి సిబ్బంది పద్మనాభం పట్ల దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న విజిలెన్స్ సిబ్బంది శ్యామల, భూషనలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. 
 
ఇంతలో పద్మనాభం బావమరిది నాగేశ్వర రావు అక్కడికి వెళ్లి సర్ధిచెప్పినా సిబ్బంది వినిపించుకోలేదు. ఈ లోపు అక్కడికి వచ్చిన ఎస్పీ కానిస్టేబుల్ పురుషోత్తం నాగేశ్వర రావుపై చేయి చేసుకున్నారు. దీంతో అతనికి గాయాలు అయ్యాయి. తర్వాత పద్మనాభంతో తలపై కొట్టడంతో అతనికి రక్తపోటు వచ్చి కోమాలోకి వెళ్లాడు. అప్పటి కూడా వారి వారు భక్తుల పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించారో గుర్తించలేకపోయారు. ఈలోపు అక్కడ ఉన్న భక్తులు పద్మనాభం, నాగేశ్వర రావును తీసుకుని బయటకు వచ్చి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల నుంచి పద్మనాభం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈవిషయం పోలీసు సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. 
 
ఏం జరిగిందని పద్మనాభం కుటుంబాన్ని అడిగే వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఈ సంఘటన టీటీడీ అధికారుల్లో కలకలం రేపుతుంది. భక్తులు ఎంత దురుసుగా ప్రవర్తించినా వారికి నచ్చచెప్పాల్సిన సిబ్బంది ఎందుకు చెయ్యేసుకున్నారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. దానికితోడు పోలీసులకు, విజిలెన్స్ అధికారులు మధ్య ఉన్న విభేదాలతో ఇది చిలికిచిలికి గాలివానగా మారింది. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు టీటీడీ తీరును నిరసిస్తున్నాయి. టీటీడీ సిబ్బంది ఉండేది భక్తులకు భద్రత కల్పించడానికా లేక దాడులు చేయడానికా అంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఉన్నతాదికారులు స్పందించి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments