ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల నేడే..

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (09:43 IST)
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఇంటర్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జూన్ 12 శుక్రవారం ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ల పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 12.30 తర్వాత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు. 
 
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన జవాబు పత్రాల మూల్యాంకనం ఇంటర్ బోర్డు అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. దీనితో శుక్రవారం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయనుంది. మార్చి 4 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి విదితమే. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు జులై 10 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి. 
 
ఇకపోతే.. విద్యార్థులు ఫలితాలను హాల్‌టికెట్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఆధారంగా https://bie.ap.gov.in/ తోపాటు ఇతర వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. మార్చి 25 నుంచి  దేశంలో లాక్ డౌన్ అమలు చేయడంతో ప్రశ్నపత్రాల వ్యాల్యూయేషన్ కాస్త ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ అమలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాల్యువేషన్ నిర్వహించిన అధికారులు ఫలితాల విడుదలకు సిద్ధం అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

Virosh: కొత్త లైఫ్ ను స్టార్ చేస్తున్నాం.. ఆశీర్వదించండి : రష్మిక మందన్న

పావలా శ్యామలకు అల్లు అర్జున్ ప్రతి నెలా ఆర్థిక సాయం.. ఎంతంటే?

Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్

Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments