Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి వివాహితను వంటగదిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం...

కొందరు కామాంధులు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఒక వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా గాజువాక పట్టణంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... గాజువాక బీసీ రోడ్డు భానోజీతోట ప్రాంత

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (12:15 IST)
కొందరు కామాంధులు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఒక వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా గాజువాక పట్టణంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... గాజువాక బీసీ రోడ్డు భానోజీతోట ప్రాంతంలో నివాసముంటున్న ఓ వివాహిత (36) ఇంటికి ఈ నెల 3న నర్సీపట్నానికి చెందిన పురుషోత్తం, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన వెంకటేష్‌, హర్షరాజుతోపాటు ఓ బాలుడు వచ్చారు. ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తనిఖీ చేసేందుకు వచ్చామని చెప్పారు. 
 
ఇక్కడ అటువంటిది ఏమీ లేదని వివాహిత చెప్పినప్పటికీ నలుగురు వ్యక్తులు వినకుండా ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి... బీరువా తెరిచి అందులో ఉన్న రూ.650 తీసుకున్నారు. అనంతరం వివాహితను వంటగదిలోకి ఈడ్చుకెళ్లి పురుషోత్తం, వెంకటేష్‌లు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, బాధితురాలు సిక్కింకు చెందిన మహిళగా గుర్తించారు. ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి నివశిస్తోంది. 
 
అంతేగాకుండా మళ్లీ రేపు వస్తాం నగదు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆ మరుసటి రోజు బాలుడు వివాహితకు ఫోన్‌ చేసి ‘మీ ఇంటి దగ్గర ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద ఉన్నాను. డబ్బులు పట్టుకుని రావాలి’ అంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనలకు గురైన వివాహిత గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితురాలు ఇచ్చిన సమాచారంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిపై గతంలో అనేక దొంగతనాల కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments