Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా కూతురుపై రెక్కీ నిర్వహించిన వ్యక్తి అరెస్ట్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (16:13 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త మ‌లుపు ఇది. పెద్దాయ‌న హ‌త్య చేసింది ఎవ‌రు అనేది సీబీఐ విచార‌ణ కొన‌సాగుతుండ‌గా, క‌థ ప‌లు మ‌లుపులు తిరుగుతోంది.

తాజాగా వివేకా కుమార్తెను చంపేందుకు రెక్కీ నిర్వ‌హిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కేసు విచారిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి డీజీపీ, సీబీఐ, కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని ఆరోపిస్తూ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఈ నెల 10న ఆ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీతరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడు మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ నిర్వహించడానికి కారణాలు ఏంటి? ఫోన్లు ఎవరెవరికి చేశారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.

దీనితో ఇపుడు క‌థ కొత్త మ‌లుపు తిరిగిన‌ట్ల‌యింది. అస‌లు మ‌ణి కంఠారెడ్డి ఈ రెక్కీ ఎందుకు చేస్తున్నాడు? ఎవ‌రు ఆయ‌న‌తో ఈ ప‌నులు చేయిస్తున్నార‌నే కోణంలో సి.బి.ఐ. విచార‌ణ మ‌లుపు తిరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments