Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసుకోబోయే అమ్మాయి అతనితో మాట్లాడుతోందనీ.. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది!

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:26 IST)
విజయనగరం జిల్లాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌కు చెందిన రాంబాబు అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి జరిపించేలా పెద్దలు నిర్ణయించారు. అయితే, ఆ యువ‌తి మ‌రో యువ‌కుడితో మాట్లాడుతోంద‌ని రాంబాబు ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. చివ‌ర‌కు  పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు.
 
దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ చెల‌రేగింది. గురువారం రాత్రి ఇరు కుటుంబాల‌ను పిలిచి పోలీసులు రాజీ కుద‌ర్చ‌డంతో పోలీసుల సూచ‌న‌ల‌తో వివాహం చేసుకునేందుకు రాంబాబు అంగీకరించాడు. ఇంతలో ఏం జ‌రిగిందో తెలీదు.. నిన్న అర్థరాత్రి స‌మ‌యంలో యువ‌తిపై దారుణానికి పాల్ప‌డ్డాడు.
 
ఆ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ యువ‌కుడిని అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. వెంట‌నే స్థానికులు బాధితులు ముగ్గురిని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments