Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక తప్పుకే ప్రతిపక్షంలో పడ్డాం: రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (07:37 IST)
వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో వెనుకపడ్డామన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ రావు. అందుకే ఇవాళ ఇలా ప్రతిపక్షంలో ఉన్నామని అభిప్రాయపడ్డారు.
 
ఆ తప్పు మరోసారి పునరావృతం కాకూడదన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ స్థాయి పార్టీ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో కొల్లు రవీంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. మూడేళ్ల వైసీపీ పాలన చూశామని.. ఎంత కక్షపూరితంగా, దుర్మార్గంగా, మోసపూరితంగా పాలన సాగిస్తోందో అందరూ గమనిస్తున్నారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
 
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, వారికి అవగాహన కల్పించాలని తద్వారా భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2024లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సుశిక్షుతులై శ్రమించాలని, ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయిన సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లేందుకు భయపడుతున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేక నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడే పార్టీ తెలుగుదేశం కాదని... ఎదురు నిలిచి పోరాడే పార్టీ అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments