Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడి కోసం కట్టుకున్న భర్తను దూరం చేసుకుంది.. చివరికి?

ప్రేమికుడి కోసం ఓ మహిళ భర్తను చంపించింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను దూరం చేసుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని కుమ్మర వీధిక

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:52 IST)
ప్రేమికుడి కోసం ఓ మహిళ భర్తను చంపించింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను దూరం చేసుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని కుమ్మర వీధికి చెందిన సుధాకర్‌ను కట్టుకున్న భార్య వెంకటేశ్వరి తన ప్రియుడు, కిరాయి హంతకుడితో కలిసి హతమార్చింది.

ప్యాపిలికి చెందిన వెంకటేశ్వరికి పదో తరగతి నుంచే రాజేశ్ అనే వ్యక్తితో పరిచయం వుంది. వీరిద్దరూ ప్రేమికులు. అయితే వెంకటేశ్వరి రాజేశ్ కంటే చిన్నవాడు కావడంతో పెద్దలు సమ్మతించలేదు. 
 
అనంతరం వైటీ చెరువుకు చెందిన సుధాకర్‌తో వెంకటేశ్వరి వివాహం చేశారు. పెళ్లి తర్వాత వీరు గుత్తి పట్టణంలోని కురబవధికి మకాం మార్చారు. వీరికి బాలుడు కలిగాడు. వివాహానంతరం రాజేశ్‌తో వెంకటేశ్వరి సంబంధం కొనసాగిస్తుండేది. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను మందలించాడు. అంతే భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అతనిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. 
 
కర్నూలుకు చెందిన కిరాయి హంతకుడు శివకుమార్‌తో కలిసి భర్తను హతమార్చింది. ఈ నెల 16 రాత్రి నిద్రపోతున్న భర్తపై వెంకటేశ్వరి.. రాజేశ్, కిరాయి కలిపి హతమార్చారు. అది దొంగల పనిగా నమ్మించేందుకు ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు నగలు, రూ.19 వేల నగదును ప్రియుడు రాజేశ్‌కిచ్చి వెంకటేశ్వరి పంపించేసింది. అనుమానం రాకుండా తనను కట్టేసి, వెళ్లమని చెప్పింది. తరువాత దొంగలు పడ్డారని అరిచింది. 
 
తన భర్తను హత్య చేసి, రూ.5 లక్షల నగదు, 30 తులాల బంగారు దొంగలు ఎత్తుకెళ్లారంటూ వెంకటేశ్వరి పేర్కొనడం పట్టణంలో సంచలనం రేపింది. అయితే పోలీసులు జరిపిన విచారణలో వెంకటేశ్వరి అసలు ముద్దాయి అంటూ తేలింది. దీంతో వెంకటేశ్వరి, రాజేశ్, శివకుమార్ అరెస్టయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments