Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకెంత మంది ముస్లింలను బలిగొంటారు?:లోకేష్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (23:22 IST)
కొంతమంది పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి కోసం ఇంకెంత మంది ముస్లిం మైనారిటీలను బలిగొంటారని ప్రశ్నించారు.

సీఎం బంధువు తిరుపాల్ రెడ్డి.. అక్బర్ బాషా భూమి కబ్జా చేస్తే.. బాషాని సీఐ ఎన్ కౌంటర్ చేస్తామనడం... కుటుంబమంతా సామూహిక ఆత్మహత్యాయత్నం చేస్తే కిడ్నాప్ చేయడం.. పోలీసుల విధులా? అని నిలదీశారు. అక్బర్ బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని నమ్మించిన జగన్ రెడ్డి బృందం.. ‘దిక్కున్నచోట చెప్పుకో.. నీ భూమి ఇచ్చేది లేదని తేల్చేయడంతో బాషా కుటుంబంతో సహా మళ్లీ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని’ అన్నారు.

అక్బర్ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినా సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం బంధువుల కబ్జాలకు అండగా నిలిచి మైనారిటీ కుటుంబానికి అన్యాయం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపాల్ రెడ్డి ఆక్రమించిన అక్బర్ బాషా భూమిని అప్పగించే బాధ్యత జగన్ రెడ్డి తీసుకోవాలని, బాషా కుటుంబం త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments