Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులంటే అంత చులకనా... చొక్కా విప్పి కొడతారా: మహిళా ఏఎస్ఐ ఆవేదన

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (08:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు తాను మంత్రినన్న విచక్షణను మరిచిపోయి విధుల్లో ఉన్న సీఐని దుర్భాషలాడారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విధుల్లో ఉన్న తమ అధికారిని ప్రజాప్రతినిధి దుర్భాషలాడటంపై విశాఖకు చెందిన ఓ మహిళా ఏఎస్ఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో ఓ ఆడియోను పోస్ట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"సార్ నమస్తే అంటూ ఆమె తన ఆవేదనను ప్రారంభించారు. పోలీసులంటే అందరికీ లోకువేనా సర్ అని ప్రశ్నిచారు. మీతో మాట్లాడాలన్నా తనకు ఏడుపు వస్తుందన్నారు. ప్రతిసారి పోలీసులను బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. సీఎం ప్రోటోకాల్ ఎంతో కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మా విధులు మేం నిర్వహించడం కూడా తప్పేనా? అని నిలదీశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడటం కరెక్టేనా?" అని ప్రశ్నించారు. 
 
మీ బందోబస్తు కోసం ఉదయం నుంచే రోడ్లపై పడిగాపులు పడుతున్నారు. పై అధికారుల అదేశాలను పాటించడం కూడూ తప్పేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత రాజకీయ నాయకుడు అయితే మాత్రం పోలీసు ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments