Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తే ఆ పని చేశాడు.. భార్య అప్పు చేసిందని.. చెట్టుకు కట్టేసి?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:00 IST)
భర్త అప్పు చేస్తే భార్యను నిలదీయడం సాధారణం కానీ ఇక్కడ భిన్నంగా ఓ మహిళను భర్త, అప్పులోళ్లు కలిసి చెట్టుకు కట్టేశారు. అప్పు తీర్చలేదని కొట్టడం కూడా చేశారు. ఆదోనిలోని రాజీవ్‌ గాంధీనగర్‌లో జమ్మన్న, జమ్మక్క అనే దంపతులు నివసిస్తున్నారు.


వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జమ్మక్క ఇటీవల అదే కాలనీకి చెందిన లక్ష్మక్క వద్ద 1.10 లక్ష రూపాయలు, హనుమాన్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి వద్ద 40 వేలు, బట్టల దుకాణంలో రూ. 12 వేలు ఇలా దాదాపు 2.5 లక్షలు అప్పు చేసింది. 
 
దానిని తీర్చకుండా వాయిదా వేస్తూ వచ్చింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో ఉన్న 600 గ్రాముల వెండి, 2.5 తులాల బంగారు నగలను కూడా ఎత్తుకు వెళ్లి తాకట్టు పెట్టిందని భర్త ఆరోపిస్తున్నాడు. అప్పుల వాళ్లకు ఎగ్గొట్టి పదిరోజుల క్రిందట ఇంట్లో నుండి వెళ్లిపోయిందని కాలనీ వాసులు చెబుతున్నారు. విసిగిపోయిన అప్పుల వాళ్లకు జమ్మక్క కనిపించడంతో భర్తతో కలిసి ఆమెని కాలనీలోని చెట్టుకు కట్టివేసి నిలదీశారు. 
 
అంతేకాకుండా దండించారు. ఈ సమాచారం అందిన విలేకరుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను విడిపించింది. కుల పెద్దలతో ఈ విషయం గురించి చర్చించడానికి వారు సమ్మతించారు. ఇంత జరిగినా పోలీసులకు ఫిర్యాదు లేకపోవడం గమనార్హం. బాధితురాలు తీసుకున్న డబ్బును మరో వ్యక్తికి ఇచ్చానని, ఇప్పడు అడిగితే నాకు తెలియదు అంటున్నాడని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments