Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయ్యా అంటూ లిఫ్టడిగింది.... పైసలివ్వకుంటే కేకలేస్తానన్న కి'లేడీ'

లిఫ్టిచ్చిన పాపానికి ఓ యువకుడుకి తగినశాస్తి జరిగింది. బస్టాప్ వరకు లిఫ్టివ్వమని అడిగి బైక్ ఎక్కిన ఆ కిలేడీ... బస్టాండ్‌ కంటే ముందుగానే దిగి పైసలివ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే అరుస్తానంటూ బెదిరించిం

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (14:26 IST)
లిఫ్టిచ్చిన పాపానికి ఓ యువకుడుకి తగినశాస్తి జరిగింది. బస్టాప్ వరకు లిఫ్టివ్వమని అడిగి బైక్ ఎక్కిన ఆ కిలాడీ లేడి... బస్టాండ్‌ కంటే ముందుగానే దిగి పైసలివ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే అరుస్తానంటూ బెదిరించింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ యువకుడు ముప్పతిప్పలు పడ్డాడు. చివరకు వారిద్దరిని దూరంగా ఉండి గమనిస్తూ వచ్చిన బస్టాండ్‌లోని ప్రయాణికులు ఒక్కొక్కరిగా  అక్కడకు రావడం మొదలు పెట్టడంతో ఆ మాయలేడీ అక్కడ నుంచి మెల్లగా జారుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బైక్‌పై హిమాయత్‌నగర్‌ బయల్దేరాడు. దారిలో పరదా కప్పుకున్న ఓ యువతి భయ్యా... బస్టాప్‌ వరకూ లిఫ్ట్‌ ఇవ్వండి.. అంటూ అడిగింది. పోనీ.. సాయం చేద్దామనుకున్నాడు. బుద్ధిగానే కూర్చున్న ఆ యువతిని బస్టాప్‌ కన్నా ముందుగా కొద్ది దూరంలో దించాడు. 
 
బైక్ దిగాక... థ్యాంక్స్‌ చెబుతుందేమో అనుకున్న యువకుడికి ఊహించని షాక్‌ ఎదురైంది. ఆమె పైసలిమ్మంటూ డిమాండ్‌ చేసింది. ఇవ్వకుంటే కేకలు వేస్తానంటూ బెదిరించింది. ఏమిచేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్న బాధితుడిని గమనించిన బస్టాప్‌లోని వ్యక్తులు.. అక్కడకు వెళ్లారు. వీళ్లను గుర్తించిన ఆ కిలాడి లేడీ.. అక్కడ నుంచి నెమ్మదిగా జారుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments