Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సీఎం అయిన మరుక్షణం నుంచే టీడీపీ కార్యకర్తలకు వీపు విమానం మోతమోగుతుంది : పెద్దిరెడ్డి

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (17:54 IST)
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరక్షణం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వీపు విమానం మోత మోగుతుందని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. కడప, రాయచోటి వైకాపా కార్యకర్తల సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఇందులో మాజీ మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ, వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు తెదేపా కార్యకర్తల భరతం పడతామని బహిరంగ హెచ్చరికలు జారీచేశారు. 
 
'వైకాపా నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. సోషల్‌ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామస్థాయిలో కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతాం. 
 
వైకాపా కార్యకర్తలపై చేసిన దాడులకు ప్రతి దాడులు కచ్చితంగా ఉంటాయి. మా తడాఖా ఏందో జగన్‌ సీఎం అయ్యాక వారికి రుచి చూపిస్తాం. ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటాం, భరోసా ఇస్తామని జగన్‌ చెప్పారు. జగన్‌ ఆదేశాలను అందరూ పాటించాలి. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు' అని పెద్దిరెడ్డి అన్నారు. 
 
కాగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో భారీ మొత్తంలో ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకోవడంతోపాటు దట్టమైన అటవీ ప్రాంతంలో విలాసవంతమైన అతిథి గృహాన్ని కూడా నిర్మించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర అటవీశాఖామంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీంతో పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈ తరహా బహిరంగ హెచ్చరికలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments