Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూ వివాదం.. నెయ్యి కల్తీ కాలేదు.. ఆవు కల్తీ అయింది.. : వైకాపా నేత తమ్మినేని సీతారాం

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (09:35 IST)
పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని ఉపయోగించి చేసిన వ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. గత పాలకులు ఉద్దేశపూర్వకంగానే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో వైకాపా సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ కాలేదని, ఆవు కల్తీ అయిందంటూ సరికొత్త భాష్యం చెప్పారు. 
 
లడ్డూ వివాదంపై ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ, 'పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి.. ఆవాలు, అవిశలు, పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకొనే ఆవుల పాల నుంచి తయారు చేసే నెయ్యి కావొచ్చు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారు. మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? పరీక్షలో ఖచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని ఎస్‌బీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఉన్న లోపాలేంటి, జరిగిందేంటి అనేది తెలుసుకోవాలి. ఎంతో భద్రతగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడి విలువను మనమే తగ్గించుకోవడం అవుతుంది. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చింది' అని తమ్మినేని సీతారాం విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments