Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కొనియాడిన రోజా.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (16:27 IST)
నగరి ఎమ్మెల్యే, వైకాపా ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైకాపా తరపున ప్రజా సేవలో యాక్టివ్‌గా వుండే రోజా, ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే వీడియో ద్వారా తాను ఆరోగ్యంగానే వున్నానని క్లారిటీ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కొన్నేళ్ల క్రితం నాటి టీడీపీ నాయకురాలు.. నేటి వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. టీడీపీ నాయకురాలిగా చంద్రబాబును ఆకాశానికెత్తుతూ ఆమె మాట్లాడారు. శూరుడు.. ధీరుడు అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
''తెలుగుతల్లి అన్నపూర్ణ వరాలపట్టి.. అమ్మణ్ణమ్మ కలల పంట.. నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధాదురంధురుడు, పేదల పాలిట పెన్నిధి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు.. జగమంతా మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర.. ధీర.. శూర రాజకీయ చక్రవర్తి.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు'' అంటూ రోజా కీర్తించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments