Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో నన్ను ఓడించేందుకు వైకాపా మనిషికి రూ.లక్ష పంచుతుంది : పవన్ కళ్యాణ్

ఠాగూర్
బుధవారం, 20 మార్చి 2024 (09:22 IST)
తాను పోటీ చేస్తున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో తనను ఓడించేందుకు అధికార వైకాపా నేతలు లక్ష రూపాయల చొప్పున పంచేందుకు సిద్ధమవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం ప్రాంతానికి చెందిన అనేక మంది ప్రజలు పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డిగారి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడంట అని వెల్లడించారు.
 
'వాళ్లు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఇతరులను రానివ్వరు. స్థానికుడు అయి ఒక బీసీ యాదవ వర్గానికి చెందిన యువకుడికి అవకాశం ఇస్తే అతడిని ఓడించి ఇబ్బందులు పెట్టారు. అలాంటిది వారు మాత్రం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంట' అని విమర్శించారు. 
 
'ప్రజాస్వామ్యంలో నాలాంటి వాడు గెలిస్తే రాష్ట్రానికి మంచిది. అలాంటిది నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు కుమ్మరిస్తున్నారట. ఓటుకు రూ.10 వేలు, కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారట' అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
 
పిఠాపురంలో తనపై వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారని, అయితే ఆమె ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలోకి వస్తారని భావిస్తున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 2009లో తమ ద్వారానే వంగా గీత రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments