Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.వివేకా హత్య : సిట్ అదుపులో వైఎస్.జగన్ ముఖ్య అనుచరుడు

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (12:18 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మరోముఖ్య అనుచరుడు నాగప్ప, కుమారుడు శివల వద్ద సిట్ బృందం ప్రశ్నిస్తోంది.
 
ఈనెల 15వ తేదీన తన ఇంట్లోని బాత్రూమ్‌లో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైన విషయంతెల్సిందే. ఈ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నారు. ఇందులోభాగంగా ఈ కేసును విచారించేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. 
 
ఈ బృందం అనేక మందిని అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో విచారిస్తోంది. ముఖ్యంగా, హత్యకు గల కారణాలను ఆరా తీస్తోంది. అనుచరులే ఆయన్ని చంపేశారా? ఆస్తి తగాదాలే ముఖ్య కారణమా? వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. 
 
మరోవైపు, ఈ హత్య వెనుక పరమేశ్వర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధారులుకాగా, పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని వివిధ చోట్ల ఉన్న రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments