Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెందుర్తి మహిళను వివస్త్ర చేశారు.. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?

విశాఖలోని పెందుర్తిలో ఓ మహిళను భూకబ్జాదారులు వివస్త్రను చేశారు. కబ్జాను ప్రశ్నించిన ఓ దళిత మహిళను వివస్త్రను చేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండద

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (17:49 IST)
విశాఖలోని పెందుర్తిలో ఓ మహిళను భూకబ్జాదారులు వివస్త్రను చేశారు. కబ్జాను ప్రశ్నించిన ఓ దళిత మహిళను వివస్త్రను చేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ప్రభుత్వ భూములు లేదా డాక్యుమెంట్లు లేని భూములు, వివాదంలో ఉన్న భూములు ఉంటే వాటిపై కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు బాధిత మహిళ కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నప్పటికీ మహిళా మంత్రులు స్పందించట్లేదని మండిపడ్డారు. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా అంటూ చిత్తూరులో రోజా మాట్లాడుతూ.. మండిపడ్డారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వేరుగా మాట్లాడారు. పెందుర్తిలో మహిళపై జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటట్లు ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments