Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-12-2020- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే..?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (05:01 IST)
శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. 
 
మేషం: వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. వాహన చోదకులకు స్వల్ప ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత మెలకువ వహించండి. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. 
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి. మీ శక్తి సామర్థ్యాల మీద ఎదుటి వారికి విశ్వాసం ఏర్పడుతుంది. భాగస్వామికులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఫలసాయం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రింటింగ్, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. 
 
మిథునం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ, స్కీమ్‌ల పట్ల అప్రమత్తత అవసరం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఉద్యోగస్తులు మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా వుండటం మంచిది. తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం: స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. మీ అతిథి మర్యాదలు బంధుమిత్రులను ఆకట్టుకుంటాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
సింహం : ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆకర్షితులవుతారు.
 
కన్య: ఉద్యోగస్తుల హోదా పెరగడంతో పాటు కోరుకున్న చోటికి బదిలీలు అనుకూలిస్తాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వడం మంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
తుల: తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురౌతారు. 
 
వృశ్చికం: దంతాలు, ఎముకలు, నేత్ర సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో సంయమనం పాటించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. 
 
ధనస్సు: ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయి. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. 
 
మకరం: చెక్కుల జారీ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఇంటా బయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. దంతాలు, ఎముకలు, నేత్ర సమస్యలు తలెత్తే సూచనలున్నాయి.
 
కుంభం: స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రాన్స్ పోర్టు, ఆటో మొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
మీనం: ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌ త్వరలోనే లభిస్తుంది. రహస్యాలు దాచిపెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments