Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-12-2022 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా..

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (09:57 IST)
మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి.
 
వృషభం :- రుణయత్నాల్లో ఆటంకాలు, ధనం సకాలంలో అందకపోవటం వల్ల మీ ఆర్థిక వ్యవహారాలు వాయిదా పడతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బంధువుల రాకతో గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి లభిస్తుంది. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. విజయం మిమ్మల్ని వరిస్తుంది.
 
కర్కాటకం :- స్త్రీలకు తమ బంధువర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
సింహం :- హోటల్, తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఒకస్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచన లుంటాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. బంధు మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. గతంలో వాయిదా పడిన పనులుపూర్తి చేస్తారు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి.
 
కన్య :- గృహములో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ వ్యక్తిగత విషయాలు బయటికి తెలియచేయకండి. ఆకస్మికంగా మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
తుల :- దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైనవిషయాలు చర్చిస్తారు. పెద్దల ఆర్యోగములో మెళుకువ అవసరం. ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విబేధాలు తలెత్తుతాయి.
 
వృశ్చికం :- కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆత్మీయులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
ధనస్సు :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్నివిధాలా గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది.
 
మకరం :- ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వటం మంచిది కాదని గ్రహించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
 
కుంభం :- సినిమ, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటి విజరుగుతాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. రవాణా,ఎక్స్పోర్ట్ రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
మీనం :- సంఘంలో మీ మాట పై నమ్మకం గౌరవం పెరుగుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించకోవటం ఉత్తమం. స్త్రీలకు పనివారాలతో చికాకులు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments